సినిమా

Tollywood: క్లారిటీ లేని వెంకీ లైనప్..ఆ తర్వాతేంటీ?

4 నిమిషాల పఠనం

Tollywood: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల లైనప్ లో ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత గందరగోళం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటీ..ఎవరితో కమిటైయ్యాడు అని. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇది బావుంది కానీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో, ఒక సినిమా సెట్స్‌పైన ఉండగానే మరో ప్రాజెక్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీ ఇప్పుడు ఉండటం లేదు.

Tollywood: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల లైనప్ లో ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత గందరగోళం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటీ..ఎవరితో కమిటైయ్యాడు అని. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన వెంకీ.. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇది బావుంది కానీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సస్పెన్స్ కొనసాగుతోంది. గతంలో, ఒక సినిమా సెట్స్‌పైన ఉండగానే మరో ప్రాజెక్ట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది. ఆ క్లారిటీ ఇప్పుడు ఉండటం లేదు. ఆ సమయంలో, ఏది సరైన ప్రాజెక్ట్ అనిపిస్తే అది ఓకే చేసేస్తున్నాడు వెంకీ మామ.

త్రివిక్రమ్ సినిమా తర్వాత ఏంటి?

వెంకటేష్ ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కాంబినేషన్‌పై చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా విడుదల తర్వాత వెంకీకి షాక్ తగిలింది. ఊహించని విధంగా ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని మూటగట్టుకుంది. దీంతో, నెక్స్ట్ ఎలాంటి కథను ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

అనిల్ రావిపూడితో మరోసారి ‘జనవరి 12 విడుదల’..

ప్రస్తుతం, వెంకటేష్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. అనిల్ మార్క్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలీందే. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. అయితే, దీని తర్వాత వెనీ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో క్లారిటీ లేదు. కానీ, ప్రచారంలో గోపీచంద్ మలినేని ఉన్నాడు.

గోపీచంద్ మలినేని ఇప్పటికే, వెంకీకి కథ వినిపించగా..కొన్ని మార్పులు సూచించాడట వెంకీ. ప్రస్తుతం ఆ మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఇప్పటికే..దృశ్యం సిరీస్‌తో హిట్స్ అందుకున్న వెంకీ ఇందులో మూడవ భాగం విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మిగతా భాషల్లో దృశ్యం 3 వచ్చేసింది. కానీ, తెలుగులో వెంకీ చేసిన ఈ సినిమా పార్ట్ 3 గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు.

#Venkatesh#Anil Ravipudi#Gopichand Malineni#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి